నిద్రపోవడానికి సరైన పిల్లోని ఎంచుకోకపోతే మెడ, నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరి పడుకోవడానికి ఎలాంటి తలగడను ఎంచుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.

ముందుగా మీరు ఏ సైడ్ ఎక్కువ పడుకుంటారో తెలుసుకోవాలి. అప్పుడు సరైన పిల్లోని ఎంచుకోవచ్చు.

నార్మల్​గా బ్యాక్​ సైడ్ పడుకునేవారు మీడియం లేదా సన్నని తలగడను ఎంచుకుంటే మంచిది.

పక్కకు తిరిగి పడుకునే వారు ఫిర్మ్, మందంగా ఉండే తలగడను ఎంచుకోవచ్చు. ఇది మెడకు, వెన్నెముకకు మంచిది.

బోర్లా పడుకునేవారు సాఫ్ట్​గా, ఫ్లాట్​గా ఉండే తలగడను ఎంచుకోవాలి. లేదా పిల్లో వాడకపోవడమే మంచిది.

పిల్లో ఎప్పుడైనా మెడకు సపోర్ట్ ఇచ్చేదిగా ఉండేలా చూసుకోవాలి. మరీ ఎత్తుగా, మరీ కిందకి ఉండకూడదు.

మెమోరీ ఫోమ్ లేదా లాటెక్స్ తలగడలు ప్రెజర్​ని తగ్గించి.. మెడకు మంచి సపోర్ట్ ఇస్తాయి.

జెల్ ఇన్​ఫ్యూజ్డ్, బ్రీతబుల్ పిల్లోలు కంఫర్ట్​బుల్​గా ఉంటాయి. టెన్షన్​ని తగ్గిస్తాయి.

ఆర్థోపెడిక్ పిల్లోస్ మరింత ఫ్లెక్సీబుల్​గా ఉంటాయి. మెడనొప్పిని దూరం చేస్తాయి.