HIVని పూర్తిగా నయం చేయలేము కానీ.. కంట్రోల్ చేయవచ్చు. ఈ ప్రాణాంతక వ్యాధిని చికిత్సతో కాస్త కంట్రోల్లో పెట్టుకోవచ్చు. HIVకి మూడు దశల్లో చికిత్స చేస్తారు. అయితే ఏ దశలో అది ఎయిడ్స్‌గా మారుతుందంటే.. మొదటి దశలో ఫ్లూ వంటి లక్షణాలు దీర్ఘకాలం వేధిస్తాయి. రెండో దశను HIV ఇన్ఫెక్షన్ అంటారు. ఇది శరీరంలో వైరస్ వ్యాప్తిని పెంచుతుంది. ఈ దశలో మీరు చికిత్స తీసుకుంటే మీరు AIDSకి దూరంగా ఉండవచ్చు. సరైన చికిత్స తీసుకోకుంటే రక్తంలోని HIV వైరస్ AIDSగా మారిపోతుంది. AIDS రోగనిరోధక వ్యవస్థను కృంగదీసి ఆరోగ్య సమస్యలు పెంచుతుంది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)