మనం రోజంతా చేసే పనులు, మన జీవనశైలి మీద నిద్ర నాణ్యత ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర కోసం కొన్ని చిన్న చిట్కాలు

ఉపక్రమించిన వెంటనే నిద్ర రావడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

విశ్రాంతిగా పడుకుని ముఖం, మెడ, భుజాలు చేతుల కండరాలను వదులు చెయ్యాలి.

తర్వాత ఛాతి, పొట్ట, తొడలు, కాళ్లు, పాదాల కండరాలను క్రమంగా వదులుగా వదిలెయ్యాలి.

మనసును స్థిమితంగా పెద్దగా ఆలోచనలు లేకుండా విశ్రాంతి స్థితిలో పెట్టుకోవాలి. కళ్లు మూసుకుని ప్రశాంతమైన చీకటిని ఊహించాలి.

ఈ రకంగా నిద్రకోసం ప్రయత్నిస్తే త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశాలు మెరుగవుతాయి.

అన్నింటికంటే ముఖ్యంగా స్క్రీన్ టైమ్ బాగా తగ్గించాలి. ఇది నిద్రమీద నేరుగా ప్రభావం చూపుతుంది.

నిద్ర సమయానికి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవద్దు. సాయంత్రాలు కాఫీ తాగడం మానెయ్యాలి.

రోజు ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించడం అలవాటు చేసుకోవాలి. ఇలా స్లీప్-అవేక్ సైకిల్ సెట్ చేసుకోవడం అవసరం.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.