భోజనం తర్వాత ఈ పనులు వద్దు, ఎందుకంటే?

భోజనం తర్వాత కొంతమంది టీ తాగడం, స్మోకింగ్ తదితర అలవాట్లు ఉంటాయి.

అయితే, భోజనం చేసిన వెంటనే అలాంటి పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే నిద్రపోతే ఆహారం జీర్ణం కాదు. గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.



భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తే చిన్న కునకు తీయొచ్చు.

భోజనం తర్వాత స్నానం చేస్తే కాళ్లు, చేతులకు రక్త సరఫరా పెరుగుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది.

తిన్న వెంటనే పండ్లు తిన్నట్లయితే గ్యాస్ట్రిక్ సమస్య రావచ్చు.

భోజనానికి గంట ముందు లేదా గంట తర్వాత మాత్రమే పండ్లు తినాలి.

ఆహారం తీసుకున్న తర్వాత సిగరెట్ కాల్చితే త్వరగా క్యాన్సర్ బారినపడతారు.

భోజనం తర్వాత టీ తాగితే యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కాదు.