ఎండుద్రాక్ష లేదా కిస్మిస్ తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది. కిస్మిస్.. పళ్లు పుచ్చి పోవడాన్ని, చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది. ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలం. అనిమియాతో బాధపడే వారికి మంచి ఉపయోగకరం. కిస్మిస్ లో కాల్షియం, బోరాన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు. కిస్మిస్ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో ఉండే పోటాషియం వల్ల బీపి అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కిస్మిస్ లో ఉండే సహజమైన చక్కెరలు వెంటనే శక్తి విడుదలయ్యేందుకు దోహదం చేస్తాయి. కిస్మిస్ లలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అవసరం. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే