ఆ ‘పని’ తర్వాత ఈ పనులు తప్పనిసరి - లేకపోతే ప్రమాదమే!

మీరు మీ భాగస్వామితో పడక సుఖం పొందిన వెంటనే నిద్రపోతున్నారా? అలా అస్సలు చేయొద్దు.

ఆ పని పూర్తికాగానే మీరు వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సిందే. లేకపోతే బ్యాక్టీరియా మూత్రాశయంలోకి చేరవచ్చు.

అలాగే, మీరు కలయిక తర్వాత స్నానం చేయక్కర్లేదు. జస్ట్ ఆ రహస్య భాగాలను నీటితో కడిగితే చాలు.

మీకు స్కిన్ అలర్జీ ఉంటే.. ఆ రహస్య భాగాల్లో సబ్బులు, షాంపులు, క్లీనర్స్ పెట్టొద్దు. నీటితో శుభ్రం చేస్తే చాలు.

మహిళలు మరీ లోపలి వరకు క్లీన్ చేసే డౌస్(Douche)లను వాడకపోవడమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

డౌస్ వల్ల మంచి బ్యాక్టీరియా నాశనమై.. ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఆ పని పూర్తయిన వెంటనే నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

నీళ్లు తాగడం వల్ల మూత్రం వస్తుందని, మిగిలి బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది మూత్రంతో పోందని అంటున్నారు.

కలయిక టైమ్‌లో అక్కడ ఇక్కడ చేతులు పెడతారు కాబట్టి.. హ్యాండ్ వాష్ తప్పనిసరి.