గీజర్ ఆన్‌చేసి స్నానం చేస్తే షాక్ కొడుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

వర్షాలు పడుతున్నాయ్. ఈ టైమ్‌లో చన్నీటి స్నానం కాస్త కష్టమే. వేడి నీళ్ల స్నానం చెయ్యాల్సిందే.

ఇంట్లో గీజర్ ఉన్నవాళ్లకు వేడి నీళ్ల స్నానం పెద్ద లెక్కకాదు. షవర్ బాత్‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చు.

అయితే, గీజర్ ఆన్‌లో ఉంచి స్నానం చేస్తున్నప్పుడు.. ఓ భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది.

గీజర్ ఆన్‌లో ఉంటే.. నీళ్ల ద్వారా విద్యుత్ ప్రవహించి షాక్‌కు గురవ్వుతామనే భయం ఉంటుంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో హీటర్లు వాడాలంటేనే భయపడిపోతున్నారు.

ఇందులో సగం నిజం లేకపోలేదు. సరైన ఎర్తింగ్, వైరింగ్ లేని గీజర్లు షాక్ కొట్టే ప్రమాదం ఉంది.

అయితే, ఈ రోజుల్లో పూర్తిగా షాక్ ప్రూఫ్ గీజర్లు మార్కెట్లో లభిస్తున్నాయి.

అయినా.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి గీజర్ ఆఫ్ చేసే స్నానం చెయ్యండి.

Images and Video Credit: Pexels