Image Source: pexels

పసుపు టీతో మచ్చలేని చర్మ సౌందర్యం మీ సొంతం

శతాబ్దాలుగా భారతీయులు పసుపును ఆహారంలో వాడుతున్నారు.

వంటకు రంగు, రుచిని అందించడమే కాదు అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధులను దూరం చేస్తాయి.

పసుపును స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లోనూ వాడుతుంటారు. పసుపు టీతో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం.

ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి.

మరిగిన నీళ్లలో 2లేదా 3 అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, 2 టీస్పూన్ల పసుపు వేయాలి.

వీటిని సన్నని మంటమీద 5 నిమిషాలపాటు మరిగించాలి. తర్వాత ఆ నీళ్లను వడపోయాలి.

ఈ నీళ్లను రోజుకు రెండుసార్లు తాగినట్లయితే స్కిన్ గ్లో పెరగడంతోపాటు, స్కిన్ టోన్ సమస్యలు కూడా తగ్గుతాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.