బరువు తగ్గాలా? డిన్నర్లో ఈ ఫుడ్స్ తినండి ఆరోగ్యకరమైన జీవనశైలికి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. రాత్రి భోజనం అనేది కీలకమైంది. బరువు తగ్గాలంటే నైట్ డిన్నర్ లో ఈఫుడ్స్ తీసుకోవాలి. టెస్టింగ్ బడ్స్ ను కూడా మెప్పింగ్ పలు రకాల రుచికరమైన ప్రొటీన్ రిచ్ డిన్నర్ చూద్దాం. కూరగాయలను మీ భోజనంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. టోఫు వంటి ఫుడ్ లో ప్రొటీన్, కాల్షియం, ఐరన్ ఉంటుంది. బరువు తగ్గడానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. చేపల్లో లీన్ ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని డిన్నర్ లో తీసుకోవాలి. క్వినోవా, ఆస్పరాగస్, కాయధాన్యాలు, దానిమ్మపండు ఇవన్నీ కూడా సలాడ్స్ రూపంలో తీసుకోవాలి. హమ్మస్ బౌల్స్ పై చేసే చికెన్ త్వరగా అరుగుతుంది. వీటిని రోటీతో తినవచ్చు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.