కీటకాలు తింటే ఆరోగ్యానికి మంచిదా? ఏంటి మీరు చెప్పేది అనేగా మీ సందేహం? కీటకాలను తినడం ఆరోగ్యానికి మంచిదేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందట. కీటకాల్లో ప్రొటీన్, విటమిన్లు, బి12, రిబోఫ్లావిన్, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. గొడ్డుమాంసం, చికెన్ లో కంటే ఎక్కువ ప్రోటీన్ కీటకాల్లో ఉంటుందట. కీటకాల్లో ఒమేగా3, ఒమేగా 6 వంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. కీటకాలు తినే సాంప్రదాయన్ని Entomophagy (ఎంటోమోఫాగి) అంటారు. ఎన్నో దేశాల్లో దీన్ని పాటిస్తున్నారు. సాంప్రదాయిక పశువుల పెంపకం కంటే కీటకాల పెంపకం మెరుగైంది. వీటి పెంపకం తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తుంది. కీటకాలు తింటే ఆరోగ్యానికి మేలు. కానీ అలెర్జీ ఉన్న వ్యక్తులు తినకపోవడమే బెటర్. కీటకాలు తినడం అనేది ప్రాసెసింగ్ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. వాటిని ఎలా వండాలో అనేది అవగాహన ఉండాలి. గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సంప్రదించిన తర్వాతే పాటించాలని మనవి.