Image Source: pexels

వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే డ్రింక్స్ ఇవే

వర్షాకాలం అనేక వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు స్వాగతం పలుకుతుంది.

ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది వ్యాధుల బారిన పడుతుంటారు.

సీజనల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకునేందుకు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నల్లమిరియాలు, తేనెకూడా కలుపుకోవచ్చు.

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడానికి బదులు తులసి టీ తాగితే మంచిది.

గోరువెచ్చని నీటిలో తేనె, దాల్చినచెక్క పొడి కలుపుకుని తాగాలి. జీర్ణసమస్యలను అరికడుతుంది.

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, ఫ్లూను నివారిస్తుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.