ఇవి ఫాలో అయితే వారంలో కూడా బరువు తగ్గొచ్చు
బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే బరువును కంట్రోల్ చేయొచ్చట.
ప్రోపర్ డైట్, హెల్తీ రోటీన్‌ను రెగ్యూలర్‌గా ఫాలో అయితే బరువు తగ్గొచ్చని చెప్తున్నారు యోగా నిపుణులు.
బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ ఆకలిని పెంచుతుంది. మెటబాలీజంని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు పెరుగుతారు.
బరువు తగ్గాలనుకుంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి బరువును తగ్గించి న్యూట్రెంట్స్ను శరీరానికి అందిస్తాయి.
బరువును తగ్గించడంలో డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు చేర్చుకోవచ్చు. ఇవి శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. పైగా ప్రోటీన్ బరువును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
కార్బో హైడ్రేట్స్ని తగ్గించి.. లో కార్బ్ డైట్‌ని ఫాలో అయితే బరువును తగ్గుతారు. కార్బ్స్‌ని ఎంత ఎక్కువగా తీసుకుంటే బరువు అంత వేగంగా పెరిగిపోతారు.
బరువు తగ్గేందుకు రోజూ ఓ అరగంట పరుగెత్తాలి. లేదంటే వేగంగా జాగింగ్ చేయాలి. ఇది కేలరీలను కరిగించి.. బరువును తగ్గేలా చేస్తుంది. మెటబాలీజం కూడా పెరుగుతుంది.
ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.