ఈ 5 లక్షణాలు గుర్తిస్తే జాగ్రత్త.. కార్డియాక్ అరెస్ట్ కావొచ్చు

గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ అనేవి సడెన్​గా వస్తాయి కాబట్టి ముందే అలెర్ట్​గా ఉండాలి.

గుండెకు రక్తప్రసరణ ఆగిపోతే అది హార్ట్ ఎటాక్, హార్ట్ పనిచేయడం మానేస్తే అది కార్డియాక్ అరెస్ట్.

ఫెటిగో లక్షణాలు అంటే కళ్లు తిరగడం, నీరసం ఎక్కువ రోజులు ఉంటే జాగ్రత్త.

నార్మల్​గా ఉన్నా ఊపిరితీసుకోవడం కష్టంగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

ఛాతీలో కంఫర్ట్​గా లేకున్నా, నొప్పిగా ఉన్నా వెంటనే అలెర్ట్ అవ్వండి.

చెమట ఎక్కువగా పడుతూ.. కళ్లు తిరుగుతూ ఉంటే వైద్యులను సంప్రదించాలి.

గుండె వేగంగా కొట్టుకోవడం లేదా సరిగ్గా కొట్టుకోకపోవడం గమనిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లండి.

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)