ఉదయాన్నే తీసుకునే ఆహారం పూర్తి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందట. అందుకే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల బరువు పెరిగిపోతున్నారట. ఇంతకీ ఆ పనులేంటి? బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ లేకపోతే.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. చాలామంది కాఫీని ఖాళీ కడుపుతో తాగితే జీర్ణ సమస్యలు పెరిగి బరువు కూడా పెరుగుతుందట. బ్రేక్‌ఫాస్ట్‌లో షుగర్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఇన్సులిన్ స్పైక్స్ అయి.. బరువు, మధుమేహం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయట. మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ కూడా కచ్చితంగా ఉండాలి. ఇది ఉంటే బరువు తగ్గడం సులభమవుతుంది. జ్యూస్ మాత్రమే తాగి.. అదే బ్రేక్‌ఫాస్ట్ అనుకుంటే బరువు పెరిగే అవకాశాలు రెట్టింపు అవుతాయట. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదని చెప్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ని లేట్‌గా తినడం లేదా మానేయడం వల్ల కూడా బరువు ఎక్కువగా పెరిగిపోతారట. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి. (Image Source : Envato)