ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉన్న టీబీ రోగులు సంఖ్య ఇండియాలోనే ఎక్కువగా ఉంది.

పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 14.96 లక్షలమంది దీనివల్ల మరణిస్తున్నారని WHO తెలిపింది.

అందుకే క్షయవ్యాధి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎవరికి దీనివల్ల అత్యంత ప్రమాదముందో తెలుసా?

ఈ ప్రమాదకరమైన అంటువ్యాధి ఎవరికి సులువుగా వస్తుందో, ఎవరికి డేంజరో చూసేద్దాం.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి టీబీ రావడం చాలా సహజం.

హెచ్​ఐవీ, ఎయిడ్స్ వంటి సమస్యలు ఉన్నవారికి కూడా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువ.

డయాబెటిస్ ఉన్నవారికి టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

5 సంవత్సరాల కంటే తక్కువ 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవారికి త్వరగా సోకుతుంది.

పోషకాహార లోపంతో బాధపడేవారికి కూడా టీబీ త్వరగా అటాక్ చేస్తుంది.

దగ్గు, జ్వరం, బరువుతగ్గడం వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.