చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే రాత్రులు అవి చేయాలట శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి. రాత్రుళ్లు కొన్ని టిప్స్ ఫాలో అయితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందంటున్నారు. పడుకునే ముందు ఫ్యాట్ ఎక్కువ కలిగిన ఫుడ్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఒమేగా 3 కలిగిన ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది. షుగర్ ఎక్కువగా ఉన్న, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. డిన్నర్ చేసిన తర్వాత కాస్త వాక్ చేస్తే చాలా మంచిది. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (All Images Source : Envato)