కొందరిని పింపుల్స్ సమస్య బాగా వేధిస్తూ ఉంటుంది. వివిధ కారణాలతో పింపుల్స్, యాక్నే సమస్యలు ఎక్కువ అవుతాయి. అయితే కొన్ని ఫుడ్స్‌తో ఈ సమస్యను తగ్గించుకోవచ్చట. సిట్రస్ పండ్లు మొటిమలను దూరం చేస్తాయి. వీటిలోని విటమిన్ సి చర్మానికి చాలా మంచిది. కీరదోస చర్మాన్ని హైడ్రేటింగ్ చేసి.. పింపుల్స్‌ను తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో బ్రొకోలీ నిండి ఉంటాయి. డార్క్ చాక్లెట్ చర్మంపై ఉన్న ఆయిల్‌ను తగ్గించి మొటిమలు రాకుండా చేస్తాయి. శనగలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. పింపుల్స్‌ను కూడా తగ్గిస్తాయి. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)