నిద్రకు ముందు వేడిగా పాలు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వేడి పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనోఆసిడ్ ఉంటుంది. సెరటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. పాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం కండరాలు, నాడులు రిలాక్స్ కావడానికి తోడ్పడతాయి. మంచి నిద్రకు దోహదం చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం పాలు మంచి పోషకాహారం. కణజాలల వృద్ధికి, ముఖ్యంగా నాడికణాలను తోడ్పడుతాయి. వేడివేడి పాలు జీర్ణవ్యవస్థ మీద మంచి ప్రభావాన్ని చూపుతాయని ఆయుర్వేదం సూచిస్తోంది. వేడివేడి పాలు రాత్రి పూట తాగడం వల్ల ఓజస్ శక్తివంతమై.. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. పాలు క్రమం తప్పకుండా తీసుకుంటే వాత దోషాలు కంట్రోల్ అవుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!