రోటీలను గ్యాస్ మంటపై కాల్చితే అంత ప్రమాదమా? బరువు తగ్గడానికి రోటీలు మంచి ఆప్షన్. ముఖ్యంగా నూనెతో పనిలేని చుక్కా రోటీలు మరింత మంచివి. వీటిని గ్యాస్ స్టవ్ మంటపై కాల్చుతారు. దీంతో అవి బాగా ఉబ్బి రుచిగా ఉంటాయి. చూసేందుకు.. తినేందుకు ఇవి బాగానే ఉంటాయి. కానీ, ఆరోగ్యానికి మంచివి కావట. ఇందుకు కారణం గ్యాస్ మంటలో కార్సినోజిక్ సమ్మేళనాలు ఉండటమే. ఇంకా హానికరమైన పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, హెటెరోసైక్లిక్ అమైన్లు కూడా ఉత్పత్తి అవుతాయట. మంటపై కాల్చేప్పుడు అవి రోటీలోకి చేరి ప్రమాదకరంగా మారతాయి. ఆ రోటీలను తినడం వల్ల భవిష్యత్తులో పలు క్యాన్సర్లకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.