బరువు తగ్గాలా? ఈ కొరియన్ డ్రింక్స్ ట్రై చెయ్యండి బరువు తగ్గేందుకు చాలా మార్గాలున్నాయి. కానీ, అంతా సులభంగా ఆ పనైపోవాలి అనుకుంటారు. అలాంటివారి కోసమే ఈ కొరియన్ డ్రింక్స్. ఇవి తాగితే చాలా ఈజీగా బరువు తగ్గిపోవచ్చు. ఆ డ్రింక్స్ మార్కెట్లో దొరుకుతాయా అనేగా మీ డౌట్? కానే కాదు.. ఇంట్లోనే తయారు చేసుకోవాలి. రోజ్ టీ: బాగా మరిగిన నీటిలో గులాబీ రేకులు, కుంకుమ పువ్వులు వేసి ఈ టీ తయారు చేయాలి. ఇలాంటి టీలలో చక్కెర వేయకపోవడమే ఉత్తమం. చక్కెర వల్ల చాలా సమస్యలు వస్తాయి. బార్లీ టీ: మన పూర్వికులు బార్లీ నీళ్లు ఎక్కువగా తాగేవారు. దాన్నే కొరియా వాళ్లు బార్లీ టీగా తాగుతారు. బార్లీ గింజలను నీటిలో వేసి బాగా మరిగించాలి. కాస్త ఉప్పు లేదా బెల్లం కలిపితే టేస్టీగా ఉంటుంది. ఈ టీలు వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి. అప్పుడే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.