మనం భోజనం చేసిన తర్వాత కొన్ని పదార్థాలు తినాలి. ఇవి జీర్ణక్రియకు దోహదపడతాయి. అవేంటో చూద్దాం. మన శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే భోజనం తర్వాత నీరు తాగితే కేలరీల సంఖ్య పెరుగుతుంది. భోజనం తర్వాత గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు, బీన్స్ వంటి ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తింటే జీవక్రియ మెరుగుపడుతుంది. భోజనం తర్వాత క్యాప్సికమ్ వంటి స్పైసీ ఫుడ్స్ తింటే జీవక్రియ మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీలో క్యాటెచిన్లు జీవక్రియను మెరుగుపరుస్తాయి. పండ్లు, కూరగాయలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెరను కంట్రోల్ చేసి జీవక్రియను మెరుగుపరుస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.