పుచ్చ కాయ గింజల్లో ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు ఇంకా చాలా పోషకాలు ఉంటాయి. పుచ్చగింజల్లో లిపిడ్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ పోషకాలు కార్డియోవాస్క్యూలార్ ఆరోగ్యానికి, బీపీ, కొలెస్ట్రాల్ అదుపుకు దోహదం చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. పుచ్చగింజల్లో మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ వల్ల ఎముకలు, కీళ్లు బలంగా తయారవుతాయి. జింక్ నిరోధక వ్యవస్థ బలానికి అవసరం. పుచ్చగింజలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ సోకకుండా నిరోధించబడుతాయి. విటమిన్ E, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు పుచ్చగింజల్లో ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పుచ్చగింజల్లో ఉండే ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వుల వల్ల అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుతుంది. పుచ్చగింజల్లో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి పుచ్చగింజలు చాలా మంచి ఆప్షన్. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!