మనలో చాలా మంది వేపాకు పేరు వినగానే 'వామ్మో ఎంత చేదు' అని అంటుంటారు. కానీ, ఆయుర్వేదంలో వేపను బాగా ఉపయోగిస్తారు. ఇంగ్లీష్ మందులతో నయం కానీ వ్యాధులను వేపతో తగ్గిస్తారు. వేపాకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి హైపర్ గ్లైసెమిక్, యాంటి ఫంగల్ లక్షణాలు ఉంటాయి. పరగడుపున వేపాకులు తింటే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. ఉదయం వేపాకులు తీసుకుంటే.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేపాకు రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులు తీసుకుంటే.. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.