మనలో చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఆ సమయంలో తలనొప్పి బాగా ఇబ్బంది పెడుతుంది. మీ ఇంటి చిట్కాలతో సులభంగా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.. అవేంటో ఇక్కడ చూద్దాం.. ద్రవ పదార్థాలను తీసుకుంటే.. తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. గ్రీన్ టీలో ఒక టీ స్పూన్ తేనె వేసుకుని తాగితే.. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే తలనొప్పి ఇట్టే మాయమవుతుంది. ఐస్‌ప్యాక్‌తో నుదుటిపై 2 నిముషాలు మసాజ్ చేస్తే, తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వ్యాయామాలు చేయడం వల్ల కూడా తలనొప్పి తగ్గుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.