మామిడి పండ్లు, మామిడి కాయలు మాత్రమే కాదు మామిడి ఆకుల్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మామిడాకుల టీ లో మాంగీ ఫెరిన్, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను అదుపు చేస్తాయి. మామిడాకుల పొడి వల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి. విరేచనాలు, మలబద్దకం వంటివి తగ్గిస్తాయి. మామిడాకుల టీ తాగితే ఆక్సిడేటివ్ డ్యామేజి వల్ల కలిగే అనారోగ్యాల నుంచి విముక్తి దొరుకుతుంది. మామిడాకుల్లో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంటుంది. మామిడాకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో మంచి ఉపశమనం దొరుకుతుంది. జుట్టు, చర్మ సంరక్షణలో కూడా మామిడాకులు చాలా ఉపయోగకరం. వీటిలోని యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మం మీద ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!