టీవి చూస్తూ ఆహారం తినడం చాలా చెడ్డ అలవాటు అని నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేదాని మీద దృష్టి నిలపకపోవడం వల్ల ఎక్కువ తినేసే ప్రమాదం ఉంటుంది. టీవీ చూస్తూ తినేందుకు ఎంచుకునేవి చాలా సందర్భాల్లో జంక్ లేదా ప్యాక్డ్ ఫూడ్ అయి ఉంటాయి. దీన్ని తప్పించుకోవడానికి కొన్ని సూచనలు నిపుణులు సూచిస్తున్నారు. తినడం ప్రారంభించే ముందు కాసేపు దీర్ఘ శ్వాస తీసుకోవాలి. అందువల్ల ఏం తింటున్నామనే దాని మీద నుంచి దృష్టి మళ్లదు. ఆహారం రంగు, స్వరూపాన్ని పూర్తి స్థాయిలో కళ్లతో చూడాలి. వాసన ఆస్వాదించాలి. ఇంద్రియాల అనుభవంతో తినడం ప్రారంభించాలి. నోట్లోకి తీసుకున్న ప్రతి ముద్ద నమలుతూ, ఆస్వాదిస్తూ.. సమయం తీసుకుని నెమ్మదిగా తినాలి. మైండ్ ఫుల్ ఈటింగ్ టెక్నిక్ ను అనుసరించడం ద్వారా భోజనం మీద దృష్టి నిలపడం అలవాటు చేసుకోవచ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!