గుమ్మడి పోషకాల గని. ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ A ఇందులో పుష్కలంగా ఉంటుంది.

గుమ్మడిలో బీటా కెరోటిన్ చాలా ఎక్కువ. ఈ కెరొటెనాయిడ్ విటమిన్ A శరీరంలో తయారయ్యేందుకు అవసరం.

ఇందులో ఉండే విటమిన్ C నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, రోగాలతో పోరాడే శక్తి శరీరంలో పెరుగుతుంది.

గుమ్మడిలో ఫైబర్ ఎక్కువ, క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్.

గుమ్మడిలో పొటాషియం తగినంత ఉంటుంది కనుక బీపీ అదుపులో ఉంచుతుంది.

గుమ్మడిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఫ్రీరాడికల్ నష్టాన్ని నివారించి యవ్వనంగా ఉంచుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే గుమ్మడి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. మలబద్దకం నివారించబడుతుంది.

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన అనేక ఫైటో కెమికల్స్ కలిగిన గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels