గర్భవతులు ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహారాలు తీసుకోకపోవడం మంచిది.

ట్యూనా, మార్లిన్ వంటి చెపల్లో మెర్క్యూరీ ఎక్కువ. కనుక వీటిని తినకూడదు.

బాగా ఉడకని మాంసాహార పదార్థాలను తీసుకోవద్దు. వీటి వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది.

గుడ్డును పచ్చిగా తీసుకోవద్దు. వీటిలో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉండొచ్చు.

పచ్చి మొలకలు తీసుకోవద్దు. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.

పాశ్చరైజ్ చెయ్యని పాల పదార్థాలు, పచ్చిపాలు మంచివి కాదు. సాల్మోనెల్లా, ఈ. కొలి బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంది.

కొన్ని రకాల సాఫ్ట్ చీజ్‌లో ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల తీవ్ర అనారోగ్యం కలుగవచ్చు. ఒక్కోసారి గర్భస్రావం కూడా జరగవచ్చు.

ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో పోషకాలు తక్కువ. క్యాలరీలు, చక్కెరలు ఎక్కువ కనుక తీసుకోవద్దు.

ఆల్కహాల్ తీసుకుంటే గర్భస్రావం కావచ్చు. ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్, స్టిల్ బర్త్ వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి.

కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. వీటి వల్ల స్టిల్ బర్త్, తక్కువ బరువున్న శిశువులు పుట్టే ప్రమాదం ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels