పీచ్ పండ్లలో చాలా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం పొడిబారకుండా నిరోధిస్తాయి. పీచ్ లతో బీపీ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పీచ్ లో కెరోటెనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటాయి. పీచ్ రక్తంలో హిస్టమిన్స్ ఉత్పత్తి పెంచి అలర్జీ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. పీచ్ లో చాలా ఫైబర్ ఉంటుంది. అందువల్ల మలబద్దకం నివారించబడుతుంది. పీచ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శరీరానికి శక్తి లభిస్తుంది. పీచ్ ఇన్సులిన్ రెసిస్టెన్నీ పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు జుట్టు పోషణకు కూడా ఉపయోగపడతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!