ఫైబర్ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఇస్తుందో చెప్పనవసరం లేదు. శరీరం నుంచి టాక్సిన్లను బయటకి పంపి బరువు తగ్గడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. బ్రోకలీ, పాలకూర, క్యారెట్స్, పెప్పర్స్ వంటివి ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువగా కలిగి ఉంటాయి. బెర్రీలు, యాపిల్స్, ఆరెంజ్ వంటివాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్, లెంటీస్ ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్నా కేలరీలు తక్కువగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్, విత్తనాల్లో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. తక్కువ కేలరీలకు పాప్ కార్న్ పెట్టింది పేరు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్వినోవా, బార్లీ, ఓట్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)