ఈ సింపుల్ డ్రింక్స్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయట.. రెసిపీలు ఇవే బరువు తగ్గాలని చాలామంది కోరుకుంటారు. వాటి కోసం వివిధ టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇంట్లో తయారు చేసుకోగలిగే కొన్ని డ్రింక్స్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. వీటిని తయారు చేయడానికి నీటితో పాటు పలు పదార్థాలు అవసరమవుతాయి. జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే చాలా మంచిది. కాళోంజి విత్తనాలను పొడి చేసి దానిని నీటిలో కలిపి నిమ్మరసం, తేనెతో కలిపి తాగితే మంచిది. గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి పరగడుపున తాగితే మంచిది. దాల్చినచెక్కను పొడి చేసి.. నీటిలో కలిపి రెగ్యూలర్‌గా తాగితే మంచిది. యాలకులను నీటిలో వేసి మరిగించి దీనిని ఉదయం లేదా రాత్రి తీసుకుంటే మంచిది. నిమ్మరసం, తేనేను గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మెటబాలీజం పెరుగుతుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సూచనలో ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)