వంట చేసేటప్పుడు కొన్నిసార్లు గిన్నెలు మాడిపోతుంటాయి. అలాంటి గిన్నెలను ఎంత శుభ్రం చేసిన తెల్లగా అవ్వవు.. అలా కాకుండా వీటితో సులభంగా క్లీన్ చేసుకోవచ్చు.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. టమాటా పేస్టుతో గిన్నెల్ని క్లీన్ చేస్తే మరకలు మాయమవుతాయి. పాత్రల్ని తెల్లగా చేసేందుకు కూల్ డ్రింక్ కూడా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో ఉప్పు కలిపి గిన్నెలను క్లీన్ చేస్తే మరకలు పోతాయి. ఉల్లిపాయ తొక్కలతో గిన్నెల మరకలను సులభంగా పోగొట్టవచ్చు. గిన్నెల మురికిని క్లీన్ చేయడంలో వెనిగర్ చక్కగా పనిచేస్తుంది.