టెస్టోస్టిరాన్ ముఖ్యమైన పురుష హార్మోన్. ఈ హార్మోన్ స్థాయి మీద ఆహార ప్రభావం చూపుతుంది.

పాలీసాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన వెజిటెబుల్ ఆయిల్స్ వల్ల శరీరంలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగా తగ్గిపోయ్యే ప్రమాదం ఉంటుంది.

చక్కెరలు ఎక్కువ కలిగిన ఆహారం తీసుకోవద్దు, ఇవి టెస్టోస్టిరాన్ ఉత్పత్తి మీద ప్రభావం చూపుతాయి.

బేక్ చేసిన పదార్థాలు ఎక్కువ తినే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువగా ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

సోయాను ఆరోగ్యకరమైన ప్రొటీన్ కలిగిన ఆహారంగా భావిస్తారు కానీ ఇందులో ఫైటోఈస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ లా ప్రవర్తిస్తాయి.

ఎల్ ఆరిజినైన్ వంటి అమైనో ఆసిడ్లు కలిగిన పల్లీలు ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి టెస్టోస్టిరాన్ తగ్గే ప్రమాదం ఉంది.

మెంథాల్ వంటి సమ్మేళనాలు కలిగిన పుదీనా వంటి వాటితో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోతుందట.

పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకునే వారిలో టెస్టోస్టిరాన్ తగ్గడమే కాదు టెస్టోస్టిరాన్.. ఈస్ట్రోజన్ గా కూడా మారుతుందట.

వేపుళ్లలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు తద్వారా టెస్టోస్టిరాన్ తగ్గడానికి కారణమవుతుంది.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!