Image Source: pexels

మైగ్రేన్ కు చెక్ పెట్టాలంటే ఈ ఫుడ్స్ తినాలని నిపుణులు చెబుతున్నారు.

సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. తలనొప్పితోపాటు వాపును తగ్గిస్తుంది.

బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంది. రక్తనాళాలను సడలించడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. మైగ్రేన్, వికారం, వాపును తగ్గిస్తుంది.

పాలకూరలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. తలనొప్పికి మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.

పుచ్చకాయ డీహైడ్రేషన్, తలనొప్పికి చెక్ పెడుతుంది. నీటికంటెంట్ ఎక్కువగా ఉండటంతో హైడ్రేట్ గా ఉంచుతుంది.

క్వినోవా రైబోఫ్లావిన్ కు మంచి మూలం. మైగ్రేన్ ను తగ్గించడంలో క్వినోవా సహాయపడుతుంది.

పసుపులో కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తలనొప్పిని తగ్గిస్తాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.