మీ స్కిన్ హెల్తీగా ఉండాలనుకుంటే.. మీరు ముఖానికి ఐస్‌క్యూబ్ అప్లై చేయాలట. నిద్రలేచిన వెంటనే ముఖం ఉబ్బిపోతుందా? అయితే దానిని తగ్గించుకోవడానికి ఐస్ క్యూబ్ అప్లై చేయవచ్చు. రక్తప్రసరణను మెరుగుపరచి ముఖానికి మంచి గ్లో ఇస్తుంది. స్కిన్ ఇరిటేషన్, మంటను తగ్గించుకోవడం కోసం మీరు దీనిని ఉపయోగించవచ్చు. మొహం వాడిపోయినట్లు ఉంటుందా? రిఫ్రెష్‌గా ఉండేందుకు క్యూబ్‌తో మసాజ్ చేయవచ్చు. ఐస్ క్యూబ్‌తో రబ్ చేసిన తర్వాత మేకప్ అప్లై చేస్తే బాగా బ్లెండ్ అవుతుంది. ఎండవల్ల మీ చర్మం కమిలిపోతే ఐస్ క్యూబ్స్‌తో రబ్ చేయండి. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Pixabay)