వేసవిలో ఏదో ఓ ప్రాంతానికి టూర్లకు వెళ్లడం భారతీయ కుటుంబాలకు అలవాటు !



చల్లగా ఉండే ప్రదేశాలు.. ముఖ్యంగా వాటర్ ఫాల్స్ ఇప్పుడు హాట్ ఫేవరేట్ !



మన దేశంలో ఆరు మంచి వాటర్ ఫాల్స్ టూరిస్ట్ సెంటర్స్ ఉన్నాయి.



గోవాలోని దూద్ సాగర్ వాటర్ ఫాల్స్, మండోవి నది మీద ఉండే ఈ వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ కు కూడా బాగుంటాయి.



కర్ణాటకలోని జోగ్ వాటర్ ఫాల్స్ , ఇవి వెస్ట్రన్ ఘాట్స్ లో ఉంటాయి. అత్యంత ఎత్తు నుంచి నీళ్లు పడటం ప్రత్యేకత.



కేరళలోని అతిరెప్పలి వాటర్ ఫాల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. అడవిలో ఉండటం స్పెషాలిటీ



మేఘాలయలోని చిరపుంజీ దగ్గర ఉన్న నోకలక్కై ఫాల్స్ టూరిస్టులకు హాట్ ఫేవరేట్. చుట్టూ కొండలు ఈ ఫాల్స్ చుట్టూ ఉంటాయి.



హిమాచల్ ప్రదేశ్‌లోని భగ్సు ఫాల్స్ మరో ఎట్రాక్షన్, క్రిస్టల్ క్లియర్ వాటర్ ఇక్కడ ప్రత్యేకత.



కేరళలోని సూచిపార వాటర్ ఫాల్స్ మరో ఎట్రాక్షన్ - వేసవి పర్యటనకు ఇది ఆహ్లాదంగా ఉంటుంది.



ఈ ఆరు వాటర్ ఫాల్స్ ప్రాంతాలు మంచి పర్యాటక ప్రాంతాలు- ఒక్క సారైనా చూసి రావాల్సిన ప్రదేశాలు