Image Source: pexels

వర్షాకాలంలో ఈ పండ్లు తింటే రోగాలు రమ్మన్నారావు

వర్షాకాలం అంటేనే వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. ఈ కాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా ముఖ్యం.

వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ సీజనల్ పండ్లు తినాల్సిందే.

దానిమ్మలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి. ఎర్రరక్తకణాలను పెంచుతాయి.

నేరేడు పండ్లలో పొటాషియం, ఫొలేట్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.

రేగుపండ్లలో ఫైబర్, కాపర్, పొటాషియం, విటమిన్లు సి, కె పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకాన్ని, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

లిచిలో ఫైబర్ ఉంటుంది. అసిడిటి, అజీర్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.

బేరిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ద్రాక్షపండులో ఉండే విటమిన్ సి, ఇమ్యూనిటిని పెంచి వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను ఎదుర్కుంటుంది.

Image Source: pexels

యాపిల్స్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ ఉంటుంది. గ్లైసెమిక్ స్థాయిలను నియంత్రిస్తుంది.