రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని ఎందుకు అంటారో తెలుసా యాపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు యాపిల్ తినవచ్చు. యాపిల్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. యాపిల్.. కొల్లాజెన్ ప్రొత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడుతుంది. యాపిల్స్ ను క్రమం తప్పకుండా తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. యాపిల్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు మెదడు కణాలను రక్షిస్తాయి. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో యాపిల్స్ సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. యాపిల్స్ లోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాపిల్స్ రోజూ తింటే లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దంతక్షయాన్ని తగ్గించి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాపిల్స్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాపిల్స్ లోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.