Image Source: pexels

పిల్లలు రోజుకు ఎన్ని వాల్నట్స్ తినాలో తెలుసా

వాల్‌నట్స్‌లో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలలో మెదడు అభివృద్ధికి, పనితీరుకు కీలకం పనిచేస్తాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ న్యూట్రీషియన్స్‌ ఉన్నాయి.

వాల్‌‌నట్స్ పిల్లల శారీరక, అభిజ్ఞా అభివృద్ధికి తోడ్పడతాయి.

ఆరునెలల వయస్సు ఉన్న పిల్లలకు వాల్‌‌నట్స్ గ్రౌండింగ్ చేసి ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, దృష్టిని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వాల్‌నట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మెదడు కణాలను రక్షిస్తాయి.

పిల్లలకు 10-15 గ్రాములతో ప్రారంభించి, ఆపై 28 గ్రాముల వరకు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మోతాదుకు మించి వాల్‌‌నట్స్ తినిపిస్తే ఉబ్బరం,గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

Image Source: pexels

వాల్‌‌నట్స్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడం, అలెర్జీ వంటివి కలిగిస్తాయి.