పొటాషియం అధికంగా ఉండే ఫుడ్స్ ఇవే పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. కణాలలో పోషక రవాణాను సులభం చేస్తుంది. శరీరంలో నరాలు, కండరాల పనితీరు ప్రోత్సహించడానికి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ ఖనిజం. అరటిపండ్లలో కాకుండా ఇతర ఆహారాల్లోనూ పొటాషియం ఉంటుంది. అవేంటో చూద్దాం. స్వీట్ పొటాటోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అవకాడోలోనూ పొటాషియం అధిక మోతాదులో లభిస్తుంది. సుమారు 15శాతం ఉంటుంది. విటమిన్ కె, ఫొలేట్ గొప్ప మూలం. పుచ్చకాయలో పొటాషియం ఉంటుంది. దీంతో పాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. 1కప్పు పాలకూరలో 190గ్రాముల పొటాషియం ఉంటుంది. ఇందులో ఫొలేట్, మెగ్నీషియం, విటమిన్ ఎ, కె కూడా పుష్కలంగా ఉంటాయి. బీన్స్ లో పొటాషియం ఉంటుంది. వైట్ బీన్స్ బ్లాక్ బీన్స్ కంటే ఎక్కువ పొటాషియం కలిగి ఉంటాయి. కొబ్బరినీరు హైడ్రేటింగ్ పానీయం. ఇందులో మెగ్నీషియం, సోడియం, మాంగనీస్ తోపాటు పొటాషియం కూడా ఉంటుంది. బంగాళదుంపల్లోనూ పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. బటర్ నట్ స్క్వాష్ అనేది ఒక ముఖ్యమైన పొటాషియం మూలం. కప్పు స్క్వాష్ లో 12 శాతం పొటాషియం ఉంటుంది.