సమ్మర్​లో ఏసీ వాడే వారి సంఖ్య రెగ్యూలర్​గా కంటే ఎక్కువగానే ఉంటుంది.

ప్రస్తుతమున్న ఎండలు చూస్తుంటే కచ్చితంగా ఏసీ వాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.

అయితే ఏసీని ఉపయోగించడం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట.

ఏసీలో ఎక్కువగా ఉండడం వల్ల చల్లగా ఉంటుందేమో కానీ.. చర్మం డ్రైగా మారిపోతుందట.

ఆస్తమా, ఎలర్జీలు, తలనొప్పి ఉన్నవారిని ఏసీలు ట్రిగర్ చేస్తాయి.

ఏసీలో ఎక్కువగా ఉండడం వల్ల దాహం ఎక్కువగా వేయదు. దీనివల్ల డీహైడ్రేట్ అవుతారు.

కీళ్లనొప్పులు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కండరాలు కూడా పట్టేస్తాయి.

కళ్లు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. (Images Source : Unsplash)