ఈ విషయం తెలిస్తే రెడ్ వైన్ జోలికి వెళ్లరు. రెడ్ వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ వైన్ తాగితే ఆరోగ్యంగా ఉంటారు. రెడ్ వైన్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కానీ.. రెడ్ వైన్ తాగితే గుండె జబ్బులతో పాటు ఎన్నో అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెడ్ వైన్ వినియోగం రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ క్యాన్సర్ కు కారణంగా అవుతుంది. మితంగా తీసుకున్నా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పగటి పూట చురుకుదనాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళనను రెట్టింపు చేస్తుంది. రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అందులో ఉండే రెస్వెరాట్రాల్, ఇతర పాలీఫెనాల్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.