ఈ డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇంతకీ ఫ్రూట్స్‌ని తినాలా? తాగాలా? ఫ్రూట్స్‌ని డైట్లో తీసుకోవడం మంచిదే. దీనివల్ల ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వస్తాయి. అయితే చాలామంది ఫ్రూట్స్‌ని జ్యూస్ చేసుకుంటే మంచిది కాదు అంటారు. కరెక్టే. ఇలా జ్యూస్ చేయడం వల్ల దానిలోని ఫైబర్ వెళ్లిపోయి షుగర్ స్పైక్ అవుతుంది. మనం చేసే మిస్టేక్ ఏంటంటే జ్యూస్‌లోని పల్ప్ తీయడం వల్ల ఇలా జరుగుతుంది. మీరు జ్యూస్ తాగాలి అనుకున్నప్పుడు వడకట్టకుండా పల్ప్ తాగితే మీకు ఫైబర్ అందుతుంది. లేదు మేము వడకట్టే జ్యూస్ తాగుతాము అనుకున్నప్పుడు.. జ్యూస్ తాగకుండా డైరక్ట్ ఫ్రూట్స్ తినండి. మీ కేలరీలను బట్టి ఫ్రూట్స్ తీసుకుంటే హెల్త్‌కి మంచిది. ఇవి అవగాహన కోసమే. వైద్యులను సంప్రదించి మీరు వీటిని తీసుకుంటే మంచిది. (Images Source : Unsplash)