క్రూ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు కృతి ఇంటర్వ్యూలు ఇచ్చింది. అప్పుడే ఓ ఇంటర్వ్యూలో తన భర్తలో ఈ క్వాలిటీలు ఉండాలంటూ చిట్టా విప్పింది. రిలేషన్షిప్లో ప్రతి ఎఫర్ట్‌ని గుర్తించి.. అప్రిషియేట్ చేసే భర్త కావాలని తెలిపింది. తనకోసం సింపుల్ గెస్టర్స్ చేసినా చాలని.. అవి అతనిలోని ప్రేమకు గుర్తని తెలిపింది. సినిమాకు వెళ్లినప్పుడు తనకి చలి వేస్తుందేమోనని జాకెట్ మోసుకొచ్చే భర్త కావాలని మనసులో మాట చెప్పింది. ఇవి అతనిలోని రోమాంటిక్ లక్షణాలు తెలుపుతాయని వెల్లడించింది ఈ బ్యూటీ. అలాగే అన్ని రకాలుగా తనను అర్థం చేసుకునే భర్త రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. తను కూడా ఇదే తరహాలో తన భర్తని ప్రేమిస్తానని తెలిపింది. (Images Source : Instagram/KritiSanon)