సమ్మర్లో కొంచెం సేపు బయటకు వెళ్లినా చాలు.. స్కిన్ టాన్ అయిపోతూ ఉంటుంది. సన్‌స్క్రీన్ అప్లై చేసినా.. ఈ టానింగ్ సమస్యను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అయితే మీరు ఇంట్లోనే ఓ సింపుల్ హోమ్ రెమిడీతో టాన్ వదిలించుకోవచ్చు. మీరు ఎండ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ మాస్క్ అప్లై చేస్తే.. టాన్‌ను సులభంగా వదిలించుకోవచ్చు. టమాటా గుజ్జులో కాఫీ పౌడర్, బియ్యం పిండి, పెరుగు వేసి పేస్ట్‌లా చేయండి. దీనిని ముఖం, చేతులు, కాళ్లకు అప్లై చేసి.. 20 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం చల్లని నీటితో వాష్ చేయండి. అనంతరం మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇది టాన్‌ను వదిలించడమే కాకుండా... మంచి గ్లోయింగ్ స్కిన్‌ను అందిస్తుంది. (Images Source : Unsplash)