ఈ మధ్య చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. ఈ కొన్ని పానీయాలు ఆహరానికి చేర్చుకుంటే మంచిది.

గ్రీన్ టీలో కెటాచిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఎముకల నష్టాన్ని నివారిస్తాయి.

ఆరెంజ్ జ్యూస్ లో కాల్షియం, విటమిన్ D ఉంటాయి. ఈ పోషకాలు ఎముకల ఆరోగ్యానికి అవసరం.

పసుపు, అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి.

ఎండు ద్రాక్షలతో తయారు చేసిన రసంలో విటమిన్ K, పొటాషియం ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలు తాగితే ఎముకలు బలపడుతాయి.

జంతువులు ఎముకలతో చేసే సూప్ కూడా ఎముకలను దృఢంగా చేస్తాయి.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.