పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు పరీక్షలు బాగా రాయలంటే కొన్ని పనులు అసలు చెయ్యకూడదు.

చాలా మంది పరీక్ష ముందు రోజు రాత్రి నిద్రపోలేరు, రాత్రంతా ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు.

మెదడు చురుకుగా ఉండాలంటే కనీసం 8 గంటల నిద్ర ఉండాలి.

పరీక్ష ముందు రోజు కొత్త చాప్టర్లు చదవ కూడదు. నేర్చుకున్న వాటిని రివ్యూ చేసేందుకే ఆ సమయాన్ని కేటాయించాలి.

ఒకొక్కరి సామర్థ్యం ఒక్కోవిధంగా ఉంటుంది. పక్కవారితో పోల్చుకుంటే మీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.

పరీక్షల కోసం చదువుతూ భోజనాన్ని అశ్రద్ధ చెయ్యొద్దు. నీళ్లు కూడా తగినన్ని తాగాలి.

ఆహారం నీళ్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే అలసట, చికాకు వచ్చి సరిగా ఫోకస్ చెయ్యలేరు.

ఒకే విషయం మీద 90 నిమిషాలకు మించి మన మెదడు ఫోకస్ చెయ్యలేదు. ప్రతి 60 నిమిషాలకు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి.

Image Source: Pexels

కాబట్టి.. పరీక్షలకు ముందు ఈ విషయాలు తప్పకపాటించి.. బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.