45 ఏళ్లు వచ్చినా జ్యోతిక ఇంకా ఫిట్‌గా ఉండడానికి ముఖ్య కారణం తన డైట్ ప్లాన్సే. జ్యోతిక జిమ్‌లో వర్కవుట్స్ మాత్రమే కాదు.. డైట్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆహారం ఎక్కువగా తీసుకున్నా ఆరోగ్యానికి నష్టమే. అందుకే బ్యాలెన్డ్స్ మీల్ బెటర్ అంటోంది జ్యోతిక. వ్యాయామం అయినా, డైట్ అయినా తరచుగా చేస్తేనే మేలు అని సలహా ఇస్తోంది. ఉదయం జాగింగ్ పూర్తయిన తర్వాత తనను చాలా హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కోసం కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీకి ప్రాధాన్యత ఇస్తుంది. బయట ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదని, ఇంట్లో ఫుడ్ మాత్రమే తినాలని సూచిస్తోంది. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడమే మేలు అని జ్యోతిక పేర్కొంది. సూచన: ఈ చిట్కాలు అవగాహన కోసం మాత్రమే. (All Images Credit: Jyotika/Instagram)