కొన్ని సందర్భాల్లో ఛార్జింగ్ లేక.. పబ్లిక్ ప్లేస్​లలో ఫోన్​ ఛార్జింగ్ పెడుతూ ఉంటారు.

అయితే ఇలా ఛార్జింగ్ పెట్టడం వల్ల మీ ఎకౌంట్స్, మీ ఫోన్​లలోని డేటాను హ్యాక్ అవుతుందని తెలుసా?

పబ్లిక్ ప్లేస్​లలో హ్యాకర్లు మీ డేటాను హ్యాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

ఛార్జింగ్ ప్లేస్​లలో వెనుక లేదా బోర్డులో హ్యాకర్లు చిప్​ని ఇన్​సెర్ట్ చేస్తారట.

ముఖ్యంగా USB ఛార్జ్​లతో ఛార్జింగ్ పెడితే ఈ సమస్య మరింత ఎక్కువట.

మీ డేటాను హ్యాకర్లు మిస్ యూజ్ చేసే, మీ పర్సనల్ ఫోటోలను వాడే అవకాశముంది.

ట్రెడీషనల్ ఛార్జర్లతో ముప్పు తక్కువగా ఉన్నా.. హ్యాక్ జరిగే అవకాశాలు ఉన్నాయట.

అందుకే బయటకు వెళ్లేప్పుడు మీరు పవర్ బ్యాంక్ తీసుకెళ్లడం మంచిది. (Images Source : Unplash)