థైరాయిడ్ గ్రంథి హార్మోన్లతో జీవక్రియలన్నింటిని అదుపు చేసే అవయవం. ఈ గ్రంథి సంతులనం తప్పితే శరీరంలో జీవక్రీయలన్నీ సంతులనం తప్పుతాయి. ఈ పదార్థాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే థైరాయిడ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. పెరుగులో ఐయోడిన్ ఉంటుంది. ఇది థైరాయిడ్ పని చేసేందుకు అవసరమయ్యే పోషకం. ఆపిల్, పియర్, ప్లమ్ వంటి పండ్లలో పెక్టిన్ ఉంటుంది. ఇది శరీరంలో నుంచి మెర్యూరీ టాక్సిన్లను బయటకు పంపుతుంది. పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజల వంటివి శరీరంలో జింక్ స్థాయిలను పెంచుతాయి. జింక్ థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా అవసరం. చిక్కుళ్లు, శనగల వంటి లెగ్యూమ్స్ లో జింక్, ఫైబర్ ఉంటాయి కనుక థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ్రీన్ టీలో కెటాచిన్ ఉంటుంది. ఇది కొవ్వు కణాలను విడుదల చేసి జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి హోల్ గ్రెయిన్స్ జీవక్రియలను వేగవంతం చేస్తాయి. థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.